వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇంకా రాజీనామాలెందుకు: విహెచ్ ప్రశ్న

తమ రాజకీయాల కోసం నాయకులు విద్యార్థులను వాడుకోవద్దని ఆయన కోరారు. సమైక్యవాదులు హైదరాబాదులో సభ పెట్టడం తెలంగాణ ప్రాంతంవారిని రెచ్చగొట్టడమేనని ఆయన అన్నారు. ఈ సభ వల్ల ప్రశాంత వాతావరణం దెబ్బ తింటుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నాయకుడు అమోస్ కూడా అన్నారు. తెలంగాణపై చిదంబరం ప్రకటన స్పష్టంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమైందని, అందువల్ల రాజీనామాలు అవసరం లేదని, డెడ్ లైన్లతో కూడా పని లేదని ఆయన అన్నారు.