న్యూయార్క్: ఐపియల్ కు పాకిస్తాన్ క్రికెటర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉండిందనే తన అభిప్రాయం నుంచి వెనక్కి తగ్దేది లేదని బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ స్పష్టం చేశారు. షారూఖ్ ఖాన్ ఫ్రకటనపై శివసేన తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శివసేన చర్యలు అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు. భారత్ మంచి దేశమని, ప్రతి ఒక్కరినీ అతిథిగా అహ్వానిస్తుందని ఆయన అన్నారు. ఒక నటుడి మాటకు అతిగా ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అన్నారు.
తనను వ్యతిరేకిస్తున్న పార్టీలు అప్రజాస్వామికంగా, అనారోగ్యకరంగా వ్యవహరిస్తున్నాయని, తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటానని, ఆ బలం తనకు ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. భారతీయుడిగా తాను తన వ్యాఖ్యలకు సిగ్గపడడం లేదని, విచారపడడం లేదని ఆయన అన్నారు. షారూఖ్ ఖాన్ ఇంటి వద్ద శివసేన కార్యకర్తలు ధర్నా చేశారు. ఆయన సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి