తిరుపతి: ప్రముఖ సినీ నటుడు నాగార్జున శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు అఖిల్ తో ఆయన తిరుమలకు వచ్చారు. శుక్రవారం ఉదయం విఐపి దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. త్వరలో విడుదల కానున్న కేడి సినిమా విజయవంతం కావాలని తాను శ్రీవారిని కోరుకున్నట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ సినిమా ఈ నెల 12వ తేదీ విడుదలవుతోంది.