కాకతీయ పొలికేకకు అనుమతి నిరాకణ

Warangal
వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) ఈ నెల 7వ తేదీన తలపెట్టిన పొలికేక సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ సభను తలపెట్టారు. రాజకీయాల పాత్ర ఉందంటూ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాకతీయ విశ్వవిద్యాలయం జెఎసి హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు నుంచి తమకు సానుకూలంగా నిర్ణయం రాగలదని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో సభ నిర్వహణకు ఏర్పట్లు చేస్తున్నారు.

సభలో రాజకీయ నాయకుల పాత్ర లేదని విద్యార్థి నాయకులంటున్నారు. సభకు స్వామి అగ్నివేశ్, తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు వస్తారని వారు చెబుతున్నారు. శాంతియుతంగా తాము ఉద్యమాలు సాగిస్తున్నామని, అయినా పోలీసులు సభకు అనుమతి నిరాకరించడం సరైంది కాదని వారంటున్నారు. కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభమైన విద్యార్థుల మహా పాదయాత్రలు 7వ తేదీ నాటికి కాకతీయ విశ్వవిద్యలయానికి చేరుకుంటాయి. ఈ సభకు రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి కూడా మద్దతు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+