శ్రీశైలం: శ్రీశైలంమహాక్షేత్రంలో శుక్రవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 8.30 గంటలకు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వరపూజల అనంతరం ఉత్సవ కార్యక్రమాలకు ఆరంభసూచనగా విశేష పూజలు నిర్వహించారు. ఈ నెల 15 వరకు నవాహ్నికదీక్షతో జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం సకల ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాలకు వస్తారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరంభ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా ఉదయం యాగాశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, శివసంకల్పం, చండీశ్వర పూజ, రుత్విగ్వరణం, అఖండస్థాపన, వాస్తు పూజ, వాస్తు హోమం, పంచావరణార్చన, మండపారాధన, కలశ స్థాపన నిర్వహించారు. అలాగే సాయంత్రం 5.30 గంటల నుంచి అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన, రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ, బలిహరణలు జరుగుతాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి