సీమాంధ్ర విద్యార్థుల అరెస్టుపై నిరసన

శాంతియుతంగా పాదయాత్ర చేస్తూ గవర్నర్ కు వినతి పత్రం సమర్పించడానికి వెళ్తున్న విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తెలుగుదేశం నాయకులు దూళిపాళ్ల నరేంద్ర చౌదరి, కె. ఎర్రంనాయుడు విడివిడిగా ఖండించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వెళ్లాలంటే పాస్ పోర్టు, వీసా కావాలా అని వారు అడిగారు. తమ విద్యార్థులు పాకిస్తాన్ వెళ్లడం లేదని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెళ్తున్నారని వారన్నారు. విద్యార్థుల అరెస్టును కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా ఖండించారు.












Click it and Unblock the Notifications