శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై ఉత్కంఠ

Srikrishna
న్యూఢిల్లీ: రాష్ట్ర పరిస్థితిపై అధ్యయానానికి వేసిన శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై రాష్ట్రంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కమిటీ విధివిధానాలు సోమవారం ఖరారవుతాయని భావిస్తుండడంతో ఆ ఉత్కంఠ నెలకొంది. తమకు అనుకూలంగా ఉంటుందని తెలంగాణ నాయకులు భావిస్తుండగా, విడిపోవడం వల్ల కలిగే లాభనష్టాలపై కమిటీ అధ్యయనం చేస్తుందని సమైక్యవాదులు భావిస్తున్నారు. కమిటీకి కాల పరిమితి ఉంటుందా, ఉండదా అనే విషయంపైనే కాకుండా తెలంగాణకు అనుకులంగా ఉంటుందా, ఉండదా అనే విషయంపై కూడా ఉత్కంఠ నెలకొంది. దీంతో అందరూ విధివిధానాల వెల్లడి కోసం ఎదురు చూస్తున్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తూ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తుందని భావిస్తున్నారు.

కుటుంబానికి చెందిన కొన్ని పనులు ఉండడంతో ఆయన ఈనెల 13 నుంచే కమిటీపై దృ ష్టి పెడతానని శ్రీకృష్ణ ప్రభుత్వానికి చెప్పినట్లు తెలుస్తోంది. 13న ఆయన ఢిల్లీకి వస్తారని, అదే రోజు కమిటీ తొలి సమావేశం జరగవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో కమిటీకి సహకరించేందుకు వివిధ శాఖల కు చెందిన అధికారులను గుర్తించాల్సిందిగా కేంద్రం రాష్ట్రాన్ని కోరినట్లు తెలిసింది. విధివిధానాల గురించి జస్టిస్ శ్రీకృష్ణతో చర్చించడం పూర్తయిందని, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఇతర కోర్ కమిటీ సభ్యులు వీటిని అంతకుముందే ఆమోదించారని సమాచారం. కమిటీ సభ్య కార్యదర్శి, హోంశాఖ మాజీ కార్యదర్శి దుగ్గల్ విధి విధానాల గురించి ఢిల్లీలో చర్చించిన తర్వాత ముంబైకి వెళ్లి జస్టిస్ శ్రీకృష్ణను కలిసిన విషయం తెలిసిందే. శ్రీకృష్ణ కూడా తన అభిప్రాయాన్ని చి దంబరంతో పంచుకున్నట్లు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. విధి విధానాలు వివాదాస్పదం కాకుండా ప్రకటించాలనే బాధ్యతను సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీకి అప్పజెప్పినట్లు తెలిసింది. విధి విధానాలను ప్రకటించేప్పుడు కూడా ఎటువైపూ మొగ్గు చూపుతున్నట్లు అనుమానాలు తలెత్తనివ్వని పదజాలాన్ని ప్రణబ్ పొందుపరిచినట్లు తెలిసింది. ప్రధానంగా, ఆర్థిక, భౌగోళిక, నీటి పారుదల, శాంతి భద్రతలు, రాజధాని అంశాలను శ్రీకృష్ణ కమిటీ పరిశీలించే అవకాశాలున్నాయి. కమిటీలో నియమించిన నిపుణులు కూడా దాదాపు ఇవే రంగాలకు చెందిన వారు కావడం గమనించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+