వరంగల్ పొలికేకలో తీవ్రమైన లొల్లి

కాకతీయ విశ్వవిద్యాలయంలో తనపై దాడికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కారణమని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తనకు కెసిఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘటనలో సమైక్యవాదుల కుట్ర ఉందని దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విభజన తేవడానికి సమైక్యవాదులు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఇది జరిగిందని ఆయన అన్నారు. సభలో లొల్లి వల్ల స్వామి అగ్నివేశ్ ప్రసంగించకుండానే వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications