వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో పొలికేక సభ నిర్వహణలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు పోలీసులు ఆ కేసులు నమోదు చేశారు. మొత్తం 18 మంది కేసులు నమోదు చేసినట్లు సమాచారం. పొలికేక సభలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఎమ్మార్పీయస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగపై, ప్రముఖ తెలంగాణ గాయకుడు దేశపతి శ్రీనివాస్ పై దాడి చేసిన వారిపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టారు.
పొలికేక సభ రభసపై నమోదైన కేసుల దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పొలికేక సభలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతుండగా కొంత మంది వాటర్ ప్యాకెట్లు విసిరి గొడవ సృష్టించారు. వేరే వర్గానికి చెందిన వారు దేశపతి శ్రీనివాస్ పై దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు లాఠీచార్జీ చేసి విద్యార్థులను చెదరగొట్టారు. ఈ గొడవతో సభ అర్థాంతరంగా ముగిసింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి