చంద్రబాబును అడ్డుకున్న తెలంగాణవాదులు

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణపై అనుకూలంగా వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణవాదులు శనివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి వెళ్లిపోతుండగా వారు ఆయన కారుకు అడ్డం పడ్డారు. ధర్నాకు దిగారు. సమైక్యావాది చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ తెలంగాణవాదులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, ఎన్టీఆర్ ట్రస్టు సిబ్బంది వారిని అడ్డం తొలగించారు. దాంతో చంద్రబాబు వెళ్లిపోయారు. ఆయన ఈ విషయంపై ఏమీ మాట్లాడలేదు.

అంతకు ముందు కొంత మంది న్యాయవాదులు చంద్రబాబును కలిసి వినతిపత్రం ఇస్తామని చెప్పి అనుమతి తీసుకున్నారు. వారు రెండో అంతస్థులోని చంద్రబాబు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయనకు వినతపత్రం ఇచ్చి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. తెలంగాణపై వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయనను చుట్టుముట్టారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ భద్రతా సిబ్బంది వారిని బయటకు పంపించివేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఎదుట ధర్నాకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+