చవాన్ షారూఖ్ బాడీ గార్డు: థాకరే

Bal Thackeray
ముంబై: అశోక్ చవాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రా, బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ అంగరక్షకుడా అని శివసేన చీఫ్ బాల్ థాకరే ప్రశ్నించారు. అశోక్ చవాన్ పై బాల్ థాకరే తీవ్రంగా ధ్వజమెత్తారు. షారూఖ్ ఖాన్ బాడీ గార్డు అయితే చవాన్ సెక్యూరిటీ గార్డుల దుస్తులు ధరించాలని, షారూఖ్ ఖాన్ బంగళా బయట నిలబడి వచ్చి పోయేవారికి సెల్యూట్ కొట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన పార్టీ అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యలు చేశారు.

గత ఏడెనిమిది రోజులుగా చవాన్ పాకిస్తాన్ ప్రేమికుడు షారూఖ్ పని చేయడం తప్ప చేసిన మరో పనేమీ లేదని ఆయన అన్నారు. పోలీసు బలగాలను మొత్తాన్ని షారూఖ్ ఖాన్ కోసమే వాడారని ఆయన విమర్శించారు. చవాన్ చేయాల్సిన మరో పని కసబ్ విగ్రహాన్ని ప్రతిష్టించడమేనని ఆయన అన్నారు. ఒక్క ఖాన్ కోసం చవాన్ నిస్సహాయుడిగా మారిపోయాడని ఆయన అన్నారు. వేలాది మంది శివసైనికలను అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+