మెదక్: మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. జిల్లాలోని కొండపాక మండలం లక్డారంలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వస్తున్న లారీ ఎద్దుల బండిని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా షాద్ నగర్ సమీపంలో సఫారీ వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.