హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి(జేఏసీ) చెప్పినట్టు తాను రాజీనామా చేయనని, జేఏసీకి భయపడే ప్రసక్తే లేదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు. గతంలో టీఆర్‌ఎస్ రాజీనామా చేసి తెలంగాణ సాధించిందా అని ఆయన విద్యార్థులను ప్రశ్నించారు. తెలంగాణకు మద్దతుగా రాజీనామా చేయాలని గురువారం విద్యార్థులు విష్ణు ఇంటిని ముట్టడించారు. దీంతో ఆయన జేఏసీ మీద మండిపడ్డారు.
రాజీనామా చేసేది లేదని మాజీ హోంమంత్రి జానారెడ్డి కూడా నేడు తెగేసి చెప్పారు. కాగా రాజీనామాలు చేసిన టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలలో కొందరు పొరపాటు చేశామని బాధపడుతున్నట్టు తెలిసింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి