యూరియా ధరపై కేంద్రానికి లేఖ: సిఎం

అంతకు ముందు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. దీంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. యూరియా ధర పెంపుపై తక్షణమే చర్చించాలని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మాట్లాడడం కుదరదని, సమయాన్ని బట్టి చర్చకు అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పారు. అయినా తెలుగుదేశం సభ్యులు వినకపోవడంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications