ది బెస్ట్ లెవెల్ కు పసిడి రేట్లు- ఒక్కసారిగా తారాజువ్వలా

పసిడి ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై విడుదల కానున్న అంచనాలు వీటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఒక్క రోజులోనే తులం బంగారం ధర 2,000 రూపాయలను దాటేసింది. 2,290 రూపాయలకు చేరుకుంది. అటు వెండి ధరలోనూ ఇదే పెరుగుదల కనిపించింది.

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,46,510 రూపాయలకు చేరింది. మంగళవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే ఇందులో ఏకంగా రూ.2,290 పెరిగింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి ధర రూ.2,100 పెరిగి రూ.1,34,300 వద్ద స్థిరపడింది. వెండి కూడా భారీ పరుగులు పెట్టింది. కిలో ధర రూ.2,45,000 వద్ద ట్రేడవుతోంది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. కిందటి శుక్రవారం నుంచీ పసిడి రేట్లు పెరుగుదల బాట పట్టినప్పటికీ.. అది స్వల్పమే. దీనికి భిన్నంగా ఇప్పుడు ఒకేసారి తారాజువ్వలా పైకి ఎగబాకాయి.

Gold Prices Hits in India at MCX as Middle East Tensions and Fed Watch Drive Fresh Buying correction

ప్రస్తుతం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ 1.14 శాతం లాభపడి రూ.1,44,508 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 1.6 శాతం పెరిగి ఔన్సు‌కు 4,139.64 డాలర్లకు చేరుకుంది. వచ్చేవారం జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణాయక కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లపై వచ్చే క్లూస్ కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. దీని ప్రభావం బంగారం, వెండి ధరలను ప్రభావితం చేసింది.

చెన్నైలో 22 క్యారెట్లు రూ. 1,32,210, 24 క్యారెట్లు రూ. 1,44,230, వద్ద నిలిచింది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,34,300, 24 క్యారెట్లు రూ. 1,46,510, 18 క్యారెట్లు రూ. 1,07,590 వద్ద స్థిరపడింది. ఢిల్లీలో 22 క్యారెట్లు రూ. 1,32,360, 24 క్యారెట్లు రూ. 1,44,380 వెండి కిలో రూ. 2,40,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. పశ్చిమాసియా సంక్షోభం తీవ్రతరం కావడం వల్ల ఇవి ఇప్పట్లో శాంతించే సూచనలు కనిపించడం లేదు.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,651, 22 క్యారెట్లు - రూ. 13,430, 18 క్యారెట్లు - రూ. 11,245

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,651, 22 క్యారెట్లు- రూ. 13,430, 18 క్యారెట్లు - రూ. 10,988

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,651, 22 క్యారెట్లు- రూ. 13,430, 18 క్యారెట్లు - రూ. 10,988

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,651, 22 క్యారెట్లు- రూ. 13,430, 18 క్యారెట్లు - రూ. 10,988

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,651, 22 క్యారెట్లు- రూ. 13,430, 18 క్యారెట్లు - రూ. 10,988

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,651, 22 క్యారెట్లు- రూ. 13,430, 18 క్యారెట్లు - రూ. 10,988

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+