సాంబశివరాజు క్రియాశీల రాజకీయాల్లోకి

రాజకీయ భవిష్యత్ కోసం వారంతా బొత్స శిబిరంలోకి వెళ్లారు.అభిమానులైనా తన ఆలోచన మేరకు కాంగ్రెస్‌కు దూరంగా ఉంటారనిభావించినా, ఎన్నికల్లో అదీ జరుగలేదు. వైఎస్ ఇమేజ్‌తో వ్యక్తులనుదృష్టిలో పెట్టుకోకుండా కాంగ్రెస్ కు అనుకూలంగా సాంబశివరాజుఅభిమానులు ఓటు వేశారు. దీంతో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచిబడ్డుకొండ అప్పలనాయుడు గట్టెక్కారు. సాంబశివరాజు రాజీనామాఆ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపలేదన్న అభిప్రాయంవ్యక్తమైంది. ఆ రోజు నుంచి పార్టీ కార్యక్రమాలకూ పూర్తిగాదూరమయ్యారు. ఇన్నాళ్లకు మళ్లీ రాజకీయాలపై దృష్టి పెట్టారనేవార్తలు వినిపిస్తున్నాయి. ఈమేరకు తన రాజకీయ శిష్యుడైన బొత్ససత్యనారాయణతో సత్సంబంధాలు నెరపుతున్నట్టు సమాచారం.
దీనిని బలపరిచేలా సోమవారం చోటు చేసుకున్న పరిణామాలు కనిపించాయి. సీఎం రోశయ్యను కలిసేందుకు సాంబశివరాజు నేరుగా ఆర్‌అండ్‌బీఅతి«థి గృహానికి వచ్చారు. అక్కడ సీఎంతోకాసేపు మంతనాలు జరిపారు. అంతటితోఆగకుండా నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్దపోలీసు శిక్షణ కేంద్రం భవన ప్రారంభోత్సవకార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిరోశయ్య, మంత్రులు బొత్స సత్యనారాయణ, గాదె వెంకటరెడ్డితో పాటు వేదికపైకూర్చున్నారు. దీన్ని చూసి ఎన్నో ఏళ్లుగాఆయనకు అనుచర వర్గంగా ఉన్న నాయకుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఒకప్పటిసతివాడ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలంతాఆనందిస్తున్నారు.












Click it and Unblock the Notifications