భీమవరంలోనూ హైటెక్ వ్యభిచారం!

West Godavari Dist
ఏలూరు: రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి కోడలినని చెప్పుకూంటూ భీమవరంలో ఓ మహిళ హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తోంది. ఆమె నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రం పై నిన్న రాత్రి భీమవరం పోలీసులు దాడి చేసి పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.

స్థానిక ఏఎస్‌ రావునగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో మాధవి అనే మహిళ కుటుంబ నివాసం కోసం అని చెప్పి ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. ఆమె అక్కడ వ్యభిచారం నిర్వహిస్తోంది. తను ఒక రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి కోడలినని చెప్పుకుంటూ పోలీసుల సహకారంతోనే వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు స మాచారం.

కాగా, స్థానికుల ఫిర్యాదు మేరకు భీమవరం పోలీసులు ఆదివారం రాత్రి ఈ ఫ్లాట్‌పై దాడి చేశారు. ఏడుగురు మహిళలను, ముగ్గురు విటులను వారు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ఇప్పటి వరకు వారి అరెస్టు చూపలేదు. మాధవి అరెస్టు చూపడానికి పోలీసులు తటపటాయిస్తున్నారు. కేసు నమోదు కాకుండా భీమవరం పోలీసులపై ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+