రోడ్డు ప్రమాదంలో 8 మంది దుర్మరణం

సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తున్న లారీ ఖమ్మం వైపు నుంచి సూర్యాపేట వస్తున్న ఆటోను ఢీకొట్టింది. లారీ వేగంగా వస్తుండడంతో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఆటోలోని ప్రయాణికులంతా అక్కడికక్కడే మరణించారు. మృతి చెందిన ఆటో డ్రైవర్ నామవరం గ్రామానికి చెందినవాడని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications