కెవిపికి ప్రాధాన్యంపై హర్షకుమార్ అలక

సమావేశంలో పిసిసి అధ్యక్షుడి ప్రక్కనే ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు కూర్చుని ఉండడం చూసిన హర్షకుమార్ బయటకువచ్చారు. కాంగ్రెస్ ఎంపిల కన్వీనర్ పొన్నం ప్రభాకర్ ను కూడా ఆయన బయటకు రమ్మని పిలిచి తన ఆక్షేపణ వెలిబుచ్చారు. ప్రభుత్వ సలహాదారు పదవిలోనూ, ఏఐసిసి ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలోనూ కెవిపికి స్థానం కల్పించడంపై తాను ఇదివరకే తీవ్ర నిర సన వ్యక్తం చేశానని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో తాను కెవిపికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే సమావేశం నుంచి బయటకు వెళ్లిపోతున్నానని ఆయన ప్రభాకర్‌కు చెప్పారు.












Click it and Unblock the Notifications