కోనేరు రంగారావు కన్నుమూత

కాంగ్రెసులో రాష్ట్రం నుంచి ఆయన సీనియర్ సభ్యుడు. గూడవల్లి సర్పంచుగా పదేళ్ల పాటు పనిచేశారు. కంకిపాడు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై సాంఘిక సంక్షేమ మంత్రిగా నియమితులయ్యారు. వివిధ ముఖ్యమంత్రుల మంత్రివర్గాల్లో ఆయన పనిచేశారు. మున్సిపల్ అభివృద్ధి, దేవాదాయ, సాంఘిక సంక్షేమ శాఖలను ఆయన నిర్వహించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండు సార్లు తిరువూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
భూసంస్కరణల కోసం ప్రభుత్వం వేసిన కమిటీకి ఆయన నేతృత్వం వహించారు. ఆయన సమర్పించిన నివేదికను ప్రభుత్వం అమలు చేయడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది. నిష్పాక్షికంగా ఆయన రూపొందిచిన నివేదిక ప్రతిపక్షాల ప్రశంసలు అందుకుంది. కొనేరు రంగారావు కమిటీ నివేదికను అమలు చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికీ డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.












Click it and Unblock the Notifications