హైదరాబాద్ ఫ్రీజోన్ కాదు: రోశయ్య

Rosaiah
హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా ఫ్రీజోన్ కాదని ముఖ్యమంత్రి కె. రోశయ్య స్ఫష్టం చేశారు. హైదరాబాద్ ఫ్రీజోన్ పై రాష్ట్ర ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై చర్చకు ప్రతిపక్షాలు బుధవారం శాసనసభలో వాయిదా తీర్మానం ప్రతిపాదించాయి. దీనిపై తక్షణం చర్చ జరగాల్సిందేనని తెలుగుదేశం సహా ఇతర ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఒక సందర్భంలో ముఖ్యమంత్రి కె. రోశయ్యకు, తెలుగుదేశం సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సమయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని హైదరాబాద్ జిల్లా ఆరో జోన్ కిందికే వస్తుందని స్పష్టం చేశారు.

ప్రతిపక్షాల కన్నా ప్రభుత్వం స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఫ్లోర్ లీడర్ల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులను మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం ప్రతిపాదిస్తే సమస్య పరిష్కారమవుతుందని అనుకుంటే ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అందుకు సంబంధించి రేపు గురువారం ఉదయమే తీర్మానం ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. శాసనసభలో తీర్మానం ప్రతిపాదించడం వల్ల సమస్య పరిష్కారం కాదనేది తన ఉద్దేశమని, సమస్య పరిష్కారానికి సాయంత్రం ఫ్లోర్ లీడర్ల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామనేది తన ఉద్దేశమని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+