కొండవీడు కోట వద్ద రియల్ ఎస్టేట్ బూమ్

దీంతో భూములరేట్లు పెరిగాయి. సమీపంలో అంతర్జాతీయ స్థాయి స్పైసెస్ పార్క్ ఏర్పాటు, జాతీయ రహదారి ఉండటంతో బ్రోకర్లు భూముల రేట్లను ఏరోజుకారోజు పెంచుతున్నారు. వెంచర్లు వేసేందుకు కృష్ణా, ప్రకాశం, గుంటూరుజిల్లా వాసులేకాక తెలంగాణ ప్రాంతాలవారు వస్తున్నారు. కోట గ్రామంలో ఎకరం రూ.ఐదు లక్షలు ఉన్న భూమి రూ.25 లక్షల వరకు పెరిగింది. కొత్తపాలెం, కొండవీడులలో మొన్నటివరకు రూ.4.5 లక్షల వరకు ఉన్న భూమి రూ.14 ల క్షల వరకు పెరిగి ఆతర్వాత రూ.25 లక్షలకు చేరుకుంది. బోయపాలెం, చెంగిజ్‌ఖాన్‌పేటల్లో ఎక్కువ మొత్తంలో భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications