610 జీవోను అమలు చేస్తాం: శ్రీధర్

హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని అన్ని పార్టీలు అంటున్నప్పుడు అఖిల పక్ష సమావేశం ఎందుకని తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆయన సూచించారు. బిజెపి శాసనసభ పక్ష నేత కిషన్ రెడ్డి. సిపిఎం శాసనసభా పక్ష నేత జూలకంటి రంగారెడ్డి కూడా ఇదే సూచన చేశారు. హైదరాబాద్ ఫ్రీజోన్ విషయంపై రాజ్యాంగ సవరమకు ప్రభుత్వం ప్రయత్నించాలని లోకసత్త సభ్యుడు జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. రాజ్యాంగ సవరణ ద్వారా 14ఎఫ్ ను తొలగించి హైదరాబాద్ ఉద్యోగాలు సంబంధిత జోన్ కే చెందుతాయనే విశ్వాసం కలిగించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకుండా కంటితుడుపు చర్యలతోనే సరిపుచ్చుతుందని ఆయన విమర్శించారు.
అంతకు ముందు శాసనసభ సమావేశమైన కొద్దిపేపటికే వాయిదా పడింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. హైదరాబాద్ ఫ్రీజోన్ వ్యవహారంపై తెలుగుదేశం ఇతర ప్రతిపక్షాలు వాయిదా తీర్మానం ప్రతిపాదించాయి. ఈ వాయిదా తీర్మానంపై చర్చ జరగాల్సిందేనని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. సభను స్పీకర్ ఈ సమయంలో 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications