రూ. 86,000 కోట్లకు టెండర్ పెట్టిన పాకిస్తాన్- అమెరికా ఒప్పుకొంటే మాత్రం

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్.. ఆ గండం నుంచి గట్టెక్కేందుకు మరోసారి అమెరికాను ఆశ్రయించింది. తమ దేశ ఆర్థిక వ్యవస్థ, కరెన్సీ విలువను స్థిరీకరించడానికి వీలుగా 10 బిలియన్ డాలర్ల ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీని కోరుకుంటోంది. పాకిస్తాన్ కరెన్సీతో పోల్చుకుంటే దీని విలువ సుమారు 84,000 కోట్ల రూపాయలు. ఇరాన్ యుద్ధ చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరించిందుకు ఈ మొత్తాన్ని చెల్లించాలని కోరింది. ఈ దౌత్య సంబంధాన్ని ఇప్పుడు లాభసాటిగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.

ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికా ట్రెజరీ మంత్రి స్కాట్ బెసెంట్‌కు ఓ ప్రతిపాదన పంపింది కూడా. ఈ 84,000 కోట్ల రూపాయల మొత్తాన్ని అయిదేళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. ఈ మొత్తాన్ని తన ఫారెక్స్ నిల్వలను పెంచుకోవడానికి, రూపాయిపై ఉన్న డాలర్ ఒత్తిడిని తగ్గించుకోవడానికి వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనలు గనక ఆమోదం పొందితే.. కఠిన షరతులతో కూడిన రుణాలు తీసుకోవాల్సిన అవసరం పాకిస్తాన్ కు చాలా వరకు తగ్గుతుంది.

Pakistan Asks US for 10 Billion Dollar Exchange Stabilisation Facility as Islamabad diplomacy Iran

నిజానికి ఐఎంఎఫ్ నిర్దేశించిన ఏడు బిలియన్ డాలర్ల నిబంధనల పరిధిలో పనిచేస్తోంది పాకిస్తాన్. దీనికోసం ప్రజలపై పన్నుల భారం విపరీతంగా మోపింది. పెట్రోల్ రేట్లనూ భారీగా పెంచింది. ఫలితంగా.. అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా వ్యతిరేకతను ఎదుర్కొంటోందక్కడి ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో చైనా, సౌదీ అరేబియా వంటి మిత్ర దేశాలు అందించే తక్షణ నిధులు, రుణాల రోల్‌ ఓవర్‌లపైనే ఆధారపడింది.

ఈ నేపథ్యంలో అమెరికా నుంచి తాజాగా 10 బిలియన్ డాలర్ల ఆర్థిక చేయూత కోరుకుంటోంది. గతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెల్లించాల్సిన 3.5 బిలియన్ డాలర్ల రుణాల రీపేమెంట్ విషయంలో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. అప్పట్లో సౌదీ అరేబియా నుంచి అందిన తక్షణ సాయంతో గట్టెక్కగలిగింది. ఈ అసమతుల్యతను శాశ్వతంగా అధిగమించడానికి అమెరికా ఇచ్చే 10 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఉపయోగపడుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం అంచనా వేస్తున్నారు.

అమెరికా ట్రెజరీ విభాగం సాధారణంగా ఇతర దేశాలకు ఇలాంటి ప్యాకేజీలను మంజూరు చేసిన సందర్భాలు చాలా అరుదు. 2002లో ఉరుగ్వేకు ఇదే మాదిరి లోన్ సదుపాయాన్ని కల్పించింది. ఆ తర్వాత మళ్లీ 2025లో అర్జెంటీనాకు మాత్రమే అమెరికా ఆర్థిక సహకారాన్ని ఇచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో అమెరికా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశమౌతోంది. ఈ లోన్ కు అమెరికా అంగీకరించితే పాక్ దశ తిరిగినట్టవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+