అసెంబ్లీలో ఫ్రీజోన్ తీర్మానం ఆమోదం

తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర శాసనసభ్యులు సభలో గొడవకు దిగారు. స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ గందరగోళం మధ్యనే ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదింపజేసుకున్నారు. శాసనసభ చేసిన తీర్మానాన్ని తెలుగుదేశం రాయలసీమ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తీవ్రంగా వ్యతిరేకిందారు. దీన్ని విద్రోహ చర్యగా ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. తెలంగాణ జిల్లాలకు కూడా దీని వల్ల నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. ముందే నిర్ణయించుకున్న ప్రకారం తీర్మానం ప్రతిపాదించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications