పాక్ ఐఎస్ఐతో లగడపాటికి లింక్: రేవంత్

ఐఎస్ఐ ఎజెండాలో భాగంగానే తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ ఐఎస్ఐ అడ్డాగా మారుతుందని లగడపాటి అంటున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడానికి లగడపాటి వ్యూహరచన చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. లగడపాటికి కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నా పార్టీ అన్నా ఖాతరు లేదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఒక జోక్ గా లగడపాటి రాజగోపాల్ కొట్టిపారేశారు. తెలుగుదేశం పార్టీ మతతత్వ పార్టీ జత కట్టిందని, అటువంటి పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తాను పట్టించుకోబోనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications