తిరువనంతపురం: కింగ్‌ఫిషర్ విమానంలో నాటుబాంబు కలకలం సృష్టించింది. బెంగుళూరు-తిరువనంతపురం వెళ్లే కింగ్‌ఫిషర్ విమానంలో అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్‌ను గుర్తించిన ప్రయాణికులు సిబ్బందికి సమాచారమందించారు.
విమానం అత్యవసరంగా దిగిన తర్వాత బాంబుస్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి బ్యాగ్‌లో ఉన్న నాటుబాంబును నిర్వీర్యం చేశారు. ఎలాంటి ప్రమాదం లేకుండా బాంబు నిర్వీర్యం కావడంతో ప్రయాణికులు వూపిరిపీల్చుకున్నారు.