విశాఖపట్నం: పార్టీ నేతలతో సమానంగా తమకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ఆయన అభిమానులు కోరారు. ఆదివారమిక్కడ ఓ ప్రైవేట్ హోటల్‌లో అభిమానులతో చిరంజీవి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
దాదాపు రెండు గంటల పాటు ఆయన అభిమానులతో ఉల్లాసంగా గడిపారు. ఇకపై అభిమానులకు అందుబాటులో ఉంటానని చిరంజీవి చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక అభిమానులకు ఆయన దూరమయ్యారనే విమర్శలు వచ్చాయి.