హైదరాబాద్‌: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై వామపక్షాలు ఆందోళనకు సిద్దమౌతున్నాయి. ఈ ఉదయం మక్ధూం భవన్‌లో సీపీఎం రాష్ట్రకార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ సమావేశమయ్యారు. ధరల పైరుగుదలపై సీపీఐ, సీపీఎం కలిసిపోరాడాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. భవిష్యత్‌లో చేపట్టనున్న ఆందోళనాకార్యక్రమాలపై కూడా సమావేశంలో చర్చించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా ఏప్రిల్‌ 8న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జైల్‌భరోపై కూడ ఉభయులు చర్చించినట్టు తెలుస్తోంది.