నల్గొండ: నల్లగొండ జిల్లా నేడు పచ్చని కొండగా మారిందని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. జిల్లాలో జరిగిన పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈసందర్భంగా దిరిసించర్లలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత నల్గొండజిల్లా రూపురేఖలు మారాయన్నారు.
రాష్ట్రంలో ధాన్యం అత్యధికంగా పండించే జిల్లాల్లో నల్గొండజిల్లా కూడా ఒకటి కావడం హర్షణీయమన్నారు. పులిచింతల ముంపుబాధితులకు నష్టపరిహారం, విద్యుత్‌సమస్యలను పరిష్కరించనున్నట్లు సీఎం వెల్లడించారు.