మావోల బంద్, పోలీసులు అప్రమత్తం

మావోయిస్టు పార్టీ అగ్రనేతల ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఆ పార్టీ యాక్షన్ టీంలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్ హెచ్చరికల మేరకు పోలీసులు అప్రమత్తమైనట్లు తెలిసింది. ఉద్యమ ప్రస్థానంలో సుధీర్ఘకాలం పనిచేసిన శాఖమూరి అప్పారావు, టెక్ రమణల ఎన్ కౌంటర్ కు నిరసనగా ఆ పార్టీ సోమ, మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చింది. అంతేగాకుండా అగ్రనేతల ఎన్ కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని పార్టీ ఏటూరునాగారం, మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి దామోదర్ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాల సరిహద్దులోని ఏటూరునాగారం, తాడ్వాయి, పస్రా అటవీ ప్రాంతాల్లో పోలీసులు రెండు రోజులుగా అడవులను జల్లెడ పడుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications