తిరుపతి: తిరుమల అనంత స్వర్ణమయ ప్రాజెక్టుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా 6 కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించారు. ఆయన గురువారం తిరమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంత స్వర్ణమయ ప్రాజెక్టుకు ఆరు కోట్ల రూపాయల విరాళం ప్రకటిస్తూ 18 తలుపులకు బంగారు తాపడం చేయించేందుకు మాల్యా అంగీకరించారు. వెంకన్న ఆశీస్సులతో ఐపియల్ లో తమ జట్టు విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.