రామోజీపై చర్యలు తప్పవని చెప్పాలి: ఉండవల్లి

ముఖ్యమంత్రి కె. రోశయ్య తనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇన్ని రోజులు తనకు ఎందుకు చెప్పలేదని అతి మామూలుగానే ముఖ్యమంత్రి అడిగారని, దాన్ని మీడియా భూతద్దంలో చూపించిందని ఆయన అన్నారు. తమ మధ్య సంభాషణ చాలా సాదాగా జరిగిందని ఆయన చెప్పారు. ఏం జరిగిందనే విషయంపై తాను ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రులకు లేఖలు రాయడం కొత్తేమీ కాదని, వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16 లేఖలు రాశానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రికి రాసిన లేఖల్లోని అంశాలు ప్రజలుకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే మీడియాకు విడుదల చేశానని ఆయన చెప్పారు. ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉన్నందున్నే తాను లేఖను మీడియాకు విడుదల చేసినట్లు చెప్పారు. గత ఆరు నెలల నుంచి కలుస్తున్నావు కదా, ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని మాత్రమే సిఎం తనను అడిగినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications