పల్నాడులో మావోయిస్టు వాల్ పోస్టర్ కలకలం

Guntur
గురజాల: గురజాల పట్టణంలో మంగళవారం నూజివీడు సీడ్స్‌ యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ పల్నాడు కమిటీ పేరుతో వెలసిన వాల్‌పోస్టర్‌ విషయమై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురజాల సీఐ కమలాకరరావు తెలిపారు. ఇది నిజంగా మావోయిస్టుల పనా, లేక అల్లరిమూకలు చేశారా, అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. షుగర్‌ఫ్యాక్టరీని తరలించిన తరువాత ప్రస్తుతం ఆస్థలంలో స్పిన్నింగ్‌మిల్లు ఏర్పాటు చేశారు.

ఈ మిల్లు వివాదంలో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల కిందట మండలంలోని దైద గ్రామంలో సర్పంచి నాగేశ్వరరావు నాయక్‌ తండ్రి భగణానాయక్‌పై కొందరు వ్యక్తులు దాడిచేసి ఇది మాపనేనంటూ జనశక్తి పేరుతో లేఖ వదలివెళ్లారు. రెండు రోజుల తర్వాత జనశక్తి నేత ఈ దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదంటూ పత్రికలకు ఫోన్‌ ద్వారా తెలియపర్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో నకిలీ మావోయిస్టులపై పోలీసులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+