వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్త పిశాచులైన భార్యాభర్తల అరెస్ట్

By Santaram
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: ఇదొక కొత్తరకం మోసం. అతను ముతక బట్టలతో, నిరుపేద ఆహార్యంతో కనిపిస్తాడు. చూడగానే అయ్యో! పాపం అనిపించేలా అమాయకంగా కనిపిస్తాడు. అలా విద్యార్థులకు వద్దకు వెళ్లి 'బాబూ! మా బంధువు ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యవసరంగా రక్తం అవసరమని వైద్యులు చెప్పారు. సాయం చేయండి' అని ప్రాధేయపడతాడు.

దీంతో జాలి పడిన సదరు విద్యార్థులు పెద్ద మనసుతో రక్తదానం చేయడానికి అంగీకరిస్తారు. విద్యార్థులతో నేరుగా బ్లడ్ బ్యాంక్ ‌కు వెళ్లి రక్తం ప్యాకెట్‌ ను తీసుకుంటాడు. కళ్లల్లో నీళ్లతో వారికి కృతజ్ఞతలు చెబుతాడు. పేదోడిని బాబూ..అంటూ రక్తదానం సమయంలో అయ్యే ఖర్చును కూడా విద్యార్థుల నుంచి వసూలు చేస్తుంటాడు. ముఖ్యంగా ఏయూకు చెందిన విద్యార్థులనే ఆ వ్యక్తి ఎక్కువగా ఆశ్రయిస్తాడు.

నర్సీపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన కె.సునీల్‌కుమార్ నిత్య వ్యాపకం. అతని భార్య లత కూడా 'భర్తకు తగ్గ భార్య' అనిపించుకుంది. కొంచెం నటించి సుళువుగా డబ్బులు సంపాదిస్తున్న భర్తనే ఆదర్శంగా తీసుకుంది. ఆమె కూడా విద్యార్థుల వద్దకు వెళ్లి 'రక్తం అవసరమని' మొసలి కన్నీరు కార్చింది. అయితే ఇలా తరచూ రక్తం కోసం రావడంతో సునీల్‌కుమార్‌పై విద్యార్థులకు అనుమానం కలిగింది.

రక్తం అవసరమని పరిచయం చేసిన వ్యక్తులను ఆరా తీయగా..వారికి అధిక మొత్తానికి విక్రయిస్తున్నాడని తెలిసింది. దీంతో సిద్ధార్థ హాస్టల్ ‌లో ఉంటున్న బీఈడీ విద్యార్థి శ్రీనివాసరావు అసలు బండారాన్ని బయటపెట్టాడు. రక్తం అడగడానికి వచ్చిన సునీల్‌కుమార్‌ను మరి కొందరి విద్యార్థులతో కలిసి పట్టుకున్నాడు. అనంతరం మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. సునీల్‌తో పాటు అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ కృష్ణవర్మ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X