జైలు నుంచి నరహంతకుడు రామారావు పరారీ

ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన రామారావు గతంలో కృష్ణా జిల్లా నూజివీడు జైలు నుంచి కూడా పారిపోయాడు. అప్పుడు పరారై అతను రుద్రాక్షపల్లిలో మారణహోమం సృష్టించాడు. తమ గ్రామంపై రామారావు దాడి చేస్తాడమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రామారావు పరారీ సమాచారం అందిన వెంటనే కృష్ణా, ఖమ్మం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. రామారావును పట్టుకోవడానికి మూడు పోలీసు బృందాలను రంగంలోకి దించారు.












Click it and Unblock the Notifications