హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తక్షణ సాయం అందించండి: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో బుధవారం కురిసిన అకాల వర్షాలపై ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో గురువారం సమీక్షించారు. పంటనష్టం అంచనాకు తక్షణమే ఆయా ప్రాంతాలకు బృందాలను పంపాలని ఆదేశించారు. రైతులను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.

ఓ వైపు ఎండలు మండిపోతుంటే మరో వైపు రాష్ట్రంలోని 11 జిల్లాలను అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాలు బుధవారం రాత్రి అంధకారబంధురమైపోయాయి. అనేక చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలాయి. బుధవారంనాడు వడదెబ్బకు ఇద్దరు మరణించగా, వర్షాలవల్ల మొత్తం ఏడుగురు ఏడుగురు మరణించినట్టు సమాచారం.

బుధవారంనాడు బీహార్‌ నుంచి తమిళనాడు వరకు బలహీన అల్పపీడన ద్రోణి ఏర్పడడంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వ ర్షాలు కురిస్తే, మరికొన్ని చోట్ల వగడళ్ల వాన కురిసింది. ప్రకాశంలో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు పిడుగుపాటుకు మరణించగా, గుంటూరు, నెల్లూరు, కడప జిల్లాలలో ఒక్కొక్కరు పిడుగుపాటుకు మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X