ఒంగోలు: ప్రకాశం జిల్లాలో తండ్రీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో శనివారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు తండ్రీకొడుకులను హత్య చేసి పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. భూ వివాదమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆ హత్యకు ప్రతీకారంగా పాత కక్షలతో ఆ తండ్రీ కొడుకులను ప్రత్యర్థులు హత్య చేసినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.