వైయస్ తో జై తెలంగాణ అనిపించా: డిఎస్

పీసీసీ అధ్యక్ష పదవిలో ఉండి తెలంగాణకుఅనుకూలమైన నివేదిక ఇస్తే సీమాంధ్ర నేతలనుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే ఉద్దేశంతోనే శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వటంలేదని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం మనస్సులో ఏముందో తెలుసని, తెలంగాణ వచ్చితీరుతుందని ఆయన అన్నారు. తెలంగాణ నినాదంతో ఉన్న పార్టీలన్నీ పోట్లాడుకోవటం సరికాదని, దాంతో ప్రజలముందు చులకనవటమే తప్ప వేరే ప్రయోజనం ఉండదని డీఎస్ అన్నారు. తెరాస శ్రేణులు జై తెలంగాణన అని నినదించాలని శ్రీనివాస్ ను డిమాండ్ చేశాయి. వెంటనే ఆయన జై తెలంగాణ జైజై అంటూ నినదించారు. దీంతో తెరాస నాయకులు ఆందోళన విరమించారు.












Click it and Unblock the Notifications