కోత తీర్మానం: గట్టెక్కనున్న యుపిఎ

ఆర్థిక బిల్లు ఆమోదం కాకుండా కోత తీర్మానం ప్రతిపాదించాలనే నిర్ణయానికి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయె, వామపక్షాలు కట్టుబడి ఉన్నాయి. ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి అవసరమైన సంఖ్యాబలం ప్రతిపక్షాలకు లేదని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. తాము కోత తీర్మానాన్ని ఓడించగలమని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తాము సిద్దంగా లేమని సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్, ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ సూచనలు చేశారు. చర్చ లేకుండా వోటింగ్ కు తాము వ్యతిరేకమని ఆ ఇద్దరు నాయకులు అంటున్నారు.
ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదని, దాని దయనీయ స్థితిని ఎత్తిచూపడమే తమ ఉద్దేశమవి బిజెపి నాయకుడు రాజీవ్ ప్రతాఫ్ రూడీ అన్నారు. కోత తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్న బిఎస్పీకి 21 మంది సభ్యుల బలం ఉంది. 543 మంది సభ్యులున్న సభల సాధారణ మెజారిటీకి 272 మంది సభ్యుల మద్దతు అవసరం. యుపిఎకు 265 మంది సభ్యుల మద్దతు ఉంది. ప్రస్తుత స్థితిలో మాయావతి మద్దతుతో యుపిఎ ప్రభుత్వం సులభంగా బయట పడే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications