ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు: కెకె

శిబూ సొరేన్ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటు తాము వ్యతిరేకమనే గత వైఖరికి కట్టుబడి ఉన్నారా అని మీడియా ప్రతినిధులు అడిగితే రాజకీయాల్లో చివరి మాట ఏదీ ఉండదని ఆయన జవాబిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు కోసమే తాము ఎన్నికల్లో పోటీ చేశామని, అందువల్ల ప్రభుత్వ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. సుస్థిరత అనేది సంఖ్యాబలం వల్ల సాధ్యం కాదని, నాయకుడి వల్ల సాధ్యమవుతుందని ఆయన అన్నారు. న్యాయబద్దందా శిబూ సొరేన్ తమకు పార్లమెంటులో ఓటు చేశారని ఆయన అన్నారు. ఎన్నికల ముందు సొరేన్ తో తమకు పొత్తు ఉందని, సొరేన్ యుపిఎలో భాగస్వామి అని, ఇద్దరు ఎంపీలు తమకు బయటి నుంచి మద్దతిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications