విజయనగరం: విజయనగరం జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద ఐదో నెంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.
లారీ, ఆటో ఢీకొనడంతో ఈ దారుణమైన ప్రమాదం సంభవించింది. లారీ డివైడర్ ను ఢీకొని ఆటోపై నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆటో నుజ్జు నుజ్జు అయింది. ఆటోలో ప్రయాణిస్తున్నవారంతా మరణించారు. సంఘటనా స్థలం మృతదేహాలతో హృదయ విదారకంగా ఉంది.