తిరుపతి: ప్రముఖ నటి మనోరమకు శుక్రవారం తిరుమలలో పరాభవం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆమెకు వసతి సౌకర్యం కల్పించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆమె పద్మావతి వసతి సముదాయం వద్ద బైఠాయింపు జరిపారు.
మనోరమ నిరసనను తెలుసుకున్న టిటిడి ఇవో కృష్ణారావు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు వెంటనే వసతి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. దీంతో సమస్య సద్దుమణిగింది.