అనంతపురం: దైవదర్శనానికి వెళ్ళిన ఐదుగురు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆత్మకూరు మండలం వడ్డేపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా పడటంతో ఐదుగురు చనిపోయారు. మృతులందరూ కూడేరు మండలం ముద్దలాపురం గ్రామానికి చెందినవారు.
ఈ ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో ముప్పైమంది వున్నట్లు తెలియవచ్చింది. వీరందరూ పంపనూరు సుమ్రమణ్యేస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.