విశాఖపట్నం: విశాఖపట్నం బీమిలి మండలం దాకమర్రివద్ద జాతీయరహదారిపై రోడ్డుపక్కన తాటిముంజెలు అమ్ముకున్న వారిపై వాహనం దూసుకుపోవడంతో ఇద్దరు మహిళలు చనిపోయారు. విజయవాడ నుంచి విజయనగరం వెళుతున్న వాహనాన్ని వెనుకనుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.