వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యాచారం ఆరోపణలు: మంత్రి రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

Haratal Halappa
బెంగళూరు: స్నేహితుని భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై కర్నాటక ఆహార, పౌర సరఫరాల మంత్రి హరతాళ హాలప్ప (50) ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి హాలప్ప సంఘసేవకుడైన తన స్నేహితుని భార్యపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఓ కన్నడ దినపత్రిక ఆదివారంనాడు కథనాన్ని ప్రచురించింది. హాలప్ప నిర్వాకంపై విపక్షాలు ధ్వజమెత్తడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి బాధితురాలుగా భావిస్తున్న మహిళ ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కన్నడ పత్రిక కథనం ప్రకారం- మంత్రి హాలప్ప శివమొగ్గలోని తన స్నేహితుని ఇంట్లో గత నవంబరు 27 రాత్రి బస చేశారు. తనకు ఒంట్లో బాగాలేదని, వేరేచోట ఉన్న భద్రతా సిబ్బంది దగ్గరకు వెళ్లి మాత్రలు తేవాలంటూ హాలప్ప తన స్నేహితుడిని కోరారు. ఆ ప్రకారం మాత్రలు తెచ్చేందుకు బయటకు వెళ్లిన స్నేహితుడు తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య ఏడుస్తూ కన్పించింది. హాలప్ప తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆమె భర్తకు చెప్పింది. పత్రిక మంత్రి పేరును పరోక్షంగా మాత్రమే కథనంలో ప్రస్తావించింది.

హాలప్ప చాలా సాత్వికుడంటూ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. బిజెపి కార్యకర్తల భేటీ తరువాత ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కన్నడ దినపత్రిక కథనాన్ని ప్రస్తావించారు. అందులో వాస్తవాలు ఉన్నట్లు తనకు అనిపించడం లేదనీ, ఇదంతా విపక్షాల కుట్రగా కన్పిస్తోందని చెప్పారు. ఈ నెల 8, 12 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని, విపక్షాలు దీనిని ఒక అస్త్రంగా వాడుకునే అవకాశం ఉందని, రాజీనామాను తక్షణమే ఆమోదించాల్సిందిగా మంత్రి తనను కోరినట్లు చెప్పారు.

హాలప్ప ఉదంతం నేపథ్యంలో యడ్యూరప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. అత్యాచారంపై సీబీఐతో విచారణ జరిపించాలని, ముఖ్యమంత్రి యడ్యూరప్ప వెంటనే రాజీనామా చేయాలని కర్ణాటక పీసీసీ డిమాండు చేసింది. శివమొగ్గలో భారీఎత్తున ఆందోళన చేస్తామంటూ పీసీసీ అధ్యక్షుడు ఆర్‌.వి.దేశ్‌పాండే బెంగళూరులో ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X