హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా వాషింగ్టన్ రాష్ట్రంతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. దీనికోసం డిప్యుటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం ఈరోజు రాత్రి అమెరికా బయలుదేరి వెళ్లనుంది.
పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు, ఫిక్కీ కో ఛైర్మన్ జేఏ చౌదరి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్రంలో పర్యాటకరంగం, విద్య, ఐటీ, ఫార్మా, బయోటెక్, ఏరోస్పేస్ తదితర రంగాల్లో సహకారానికి ఈ బృందం చర్చలు జరునుతుంది.