కెజి బేసిన్ యజమాని ప్రభుత్వమే: సుప్రీం

Anil Ambani-Mukesh Ambani
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్ సహజ వాయువు యజమాని ప్రభుత్వమే యజమాని అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముకేష్, అనిల్ అంబానీ సోదరుల మధ్య నడుస్తున్న న్యాయపోరాటంలో సుప్రీంకోర్టు శుక్రవారం కీలకమైన తీర్పును వెలువరించింది. తొలి తీర్పు చాలా వరకు ముకేష్ అంబానీకి అనుకూలంగా ఉంది. దీందో అనిల్ అంబానీకి ఆర్ఎన్ఆర్ఎల్ చెందిన షేర్ ధర పడిపోతోంది. జస్టిస్ సదాశివన్ తొలి తీర్పు వెలువరించిన వెంటనే ఆర్ఎన్ఎల్ఆర్ షేర్ ధర 12 శాతం పడిపోయింది. కెజి బేసిన్ సహజ వాయువు ఎవరి సొత్తో కాదని, అది జాతీయ సంపద అని సుప్రీంకోర్టు తెలిపింది. కుటుంబం మధ్య జరిగిన ఒప్పందం ఈ విషయంలో చట్టబద్దం కాదని స్పష్టం చేసింది.

కాంట్రాక్టుపై ఆరు వారాల లోపు అంబానీ సోదరులు సంప్రదింపులు జరిపి ఒక నిర్ణయానికి రావాలని ఆదేశించింది. సహజ వాయువు ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపింది. ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్టే అధికారికమని తెలిపింది. గ్యాస్ వినియోగదారులకు చేరే వరకు ప్రభుత్వమే దాని యజమాని అని తెలిపింది. గ్యాస్ అమ్మకానికి కూడా ప్రభుత్వ అనుమతి అవసరమని సుప్రీంకోర్టు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+