రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెంట్రల్ జైలులో శ్రీనివాస కల్యాణం

By Santaram
|
Google Oneindia TeluguNews

East Godavari Dist
రాజమండ్రి: టిటిడీ వారు చేస్తున్న అనేక ప్రయోగాల్లో భాగమిది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని ఖైదీల సమక్షంలో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకను టీటీడీ ప్రధాన అర్చకుడు వాసుదేవ భట్టాచార్య ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. అంగరంగవైభవంగా జరిగిన శ్రీ వారి కల్యాణం చూసి ఖైదీలు తమ జన్మ ధన్యమైందని పరవశించారు. ఆ ఏడు కొండలవాడే తమ చెంతకు వచ్చి పెళ్లి చేసుకోవడం వారిని పులకింపచేసింది. ఈ కల్యాణంతో జైలు ఆవరణలో ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరిసింది. ఖైదీలతోపాటు జైలు అధికారులు కూడా శ్రీవారి కల్యాణం చూసి తరించారు.

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారాగారం నాలుగుగోడల మధ్య, స్వేచ్ఛా ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న ఖైదీల సమక్షంలో శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ వేడుక జరపడం అభినందనీయమన్నారు. ఖైదీలలో భక్తి భావాలు పెంపొందించి సన్మార్గానికి మళ్లే అవకాశాన్ని టీటీడీ కల్పించిందని ఎమ్మెల్యే రౌతు పేర్కొన్నారు. జైలు సూపరింటెండెంట్‌ ఏజీ సాయినాథరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్లు ఫజల్‌హక్‌, వరప్రసాద్‌, జైలర్‌ వెంకటరాజు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X