విశాఖను వణికిస్తున్న సూర్యుడు

Vishakapatnam
విశాఖపట్నం: సముద్రతీరంలో పచ్చని ప్రకృతి అందాల మధ్య ఉండే విశాఖ నగరానికి కూడా మండు వేసవి దెబ్బ తప్పలేదు. వేసవి ఎండ ఎలా ఉంటుందో నగర వాసులకు తెలిసివస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతంగా అదరగొట్టింది. నిప్పుల వానను తలపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కుతకుతలాడించింది. ఎండకు వడ దెబ్బ కూడా తోడైంది. అదే పనిగా వేడి గాలులను వెదజల్లుతూనే ఉంది. ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో సూర్యరశ్మి నేరుగా పడడంతో వేడెక్కిన భూమి ఉష్ణతీవ్రతను మొదలెట్టింది. ఫలితంగా నగరంలో 39.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

ఈ సీజనులో ఇదే అత్యధికం కావడం విశేషం. ఇప్పటిదాకా ఈ సీజనులో 38.6 డిగ్రీలే గరిష్టం. దాదాపు 40 డిగ్రీలకు ఉష్ణ్రోగత చేరుకోవడంతో జనం అల్లాడిపోయారు. బయటకు రావడానికే భయకంపితులయ్యారు. చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. నగరంలోని రోడ్లు చాలా వరకు నిర్మానుష్యంగా కనిపించాయి. సాయంత్రం కాస్త చల్లబడ్డాకా రోడ్లపైకి నెమ్మదిగా జనసంచారం మొదలయ్యింది. వేసవి తాపాన్ని తాళలేక పెద్ద ఎత్తున సాగరతీరానికి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+